Homeజిల్లాలుఅనంతపురంఘనంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

ఘనంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను అనంతపురము జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప, మరియు వివిధ గిరిజన సంఘాల నాయకులు, సిబ్బంది హాజరయ్యారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటం అజరామరం. గిరిజనుల హక్కుల కోసం, తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన విప్లవ వీరుడు అని కొనియాడారు. అల్లూరి ఆశయాలను, ఆయన పోరాట పటిమను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ” తాను అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతాల్లో పని చేసిన సమయంలో వారి స్థితిగతులను తెలుసుకుని, వారి అభ్యున్నతికి తాను కృషి చేసానని పేర్కొన్నారు. ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, గిరిజన వసతి గృహాలు, గురుకుల పాఠశాలలలో విద్యార్థుల ప్రవేశం అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, క్రమం తప్పకుండా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ నూతన కమిటీ ఏర్పాటుతో తొలి సమావేశం నిర్వహించామని, గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప మాట్లాడుతూ “గిరిజనుల హక్కుల రక్షణకు ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందనీ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావుల జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషకరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోలా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసులు, పర్యాటక శాఖ ఆర్డీ ఓబులమ్మ, వివిధ గిరిజన సంఘాల నాయకులు వారి ప్రతినిధులు మరియు గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు