విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్మీ డే ను పురస్కరించుకొని పట్టణంలోని యువర్స్ ఫౌండేషన్ సంస్థ మాజీ సైనికులైన రేణిగుంట శ్రీధర్, వంకదారు మోహన్నును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం కొత్తపేట-రాంనగర్ లోని ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్, కార్యదర్శి జయరాం తో పాటు సభ్యులు అందరూ కలిసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇరువురు ఆర్మీ ఉద్యోగులు దాదాపు 20 సంవత్సరాలు భారతదేశ సరిహద్దుల యందు విధులు నిర్వర్తించి, పదవీ విరమణ చేసిన తర్వాత వీరిని సన్మానించడం మాకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. సన్మాన గ్రహీతలు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు మాట్లాడుతూ భారతదేశానికి తమ వంతుగా తాము కృషి చేయడం జరిగిందని, జీవితములో కూడా భారతదేశానికి అండగా ఉంటూ, అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. మమ్ములను గుర్తించి యువర్ ఫౌండేషన్ వారు సన్మానించడం జీవితంలో మరుపు రాని రోజు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.
మాజీ సైనికుడి ని సన్మానించిన యువర్స్ ఫౌండేషన్ సంస్థ
RELATED ARTICLES