కలెక్టరేట్ ను పరిశుభ్రంగా ఉంచాలి
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లో ఁస్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ఁలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహణలో భాగంగా శనివారం కలెక్టరేట్ లో ఁస్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ఁ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని రికార్డు రూములను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులందరిచేత స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞను జాయింట్ కలెక్టర్ చేయించారు. మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటిదగ్గర, పనిచేసే చోట శుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుకుందామంటూ జాయింట్ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ లో భాగంగా కలెక్టరేట్ ని శుభ్రం చేస్తున్నామన్నారు. కార్యాలయంలోని ఫైల్స్ ని, కార్యాలయం ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ లలో, జిల్లా ట్రెజరీ కార్యాలయం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, డిఎస్ఓ కార్యాలయం, తదితర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. ఉపయోగించని వాహనాలను డిస్పోస్ చేయాలన్నారు. ఁస్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ఁలో భాగంగా కొత్త సంవత్సరం – పరిశుభ్రత ప్రారంభం అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎ.మాలోల, డిపిఎం ఆనంద్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు యుగేశ్వరి దేవి, వసంతలత, రియాజుద్దీన్, ఏఓ అలెగ్జాండర్, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.