Sunday, January 19, 2025
Homeజిల్లాలుఅనంతపురంఎల్సిడిసి పై ఎన్జీవో లకు అవగాహన

ఎల్సిడిసి పై ఎన్జీవో లకు అవగాహన

విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి ఆదేశానుసారము శనివారం ఎల్సిడిసి కార్యక్రమం పై ఎన్జీవో లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ ఈ . బి . దేవి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఇందులో అనంతపురం జిల్లాలో కుష్టి వ్యాధి పై పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొని తమ వంతు కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ అనే స్వచ్ఛంద సంస్థ చైర్మన్ జయంతి, శ్రీవల్లి కుష్టి వ్యాధి పై తాము చేస్తున్నటువంటి కార్యక్రమాలను తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో డా . అనుపమా జేమ్స్ జిల్లా కుష్టు మరియు టీబి అధికారి జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు చేయవలసిన పనులు గురించి ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగు ఎల్సిడిసి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్రను వారు చేయవలసిన విధులను తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో కుష్టు శాఖకు సంబంధించిన సిబ్బంది, డిస్ట్రిక్ న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె . గంగాధర్ రెడ్డి, డెమో త్యాగరాజు, పారామెడికల్ అధికారి నాగన్న ,హెఛ్ ఈ ఓ సత్యనారాయణ, డీ పి యం ఓ రామదాసు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు