Homeజిల్లాలుఅనంతపురంఅక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా...

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా…

- Advertisement -

టిప్పర్, ట్రాక్టర్, జేసీబీ సీజ్.. కేసు నమోదు

విశాలాంధ్ర – శింగనమల: మండల పరిధిలోని చీలేపల్లి, ఉల్లికల్లు తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్, ట్రాక్టర్, జేసీబీని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మారుతీనాయుడుకు సంబంధించినవని, టిప్పర్ టీడీపీ నాయకుడు ఉల్లికల్లు రంగారెడ్డికి సంబంధించినదని ఎస్‌ఐ ప్రసాద్ వెల్లడించారు.పెన్నా నది పరివాహక ప్రాంతంలోని ఉల్లికల్లు, కొరివిపల్లి, రాచేపల్లి, నిదనవాడ, తరిమెల, కల్లుమడి ప్రాంతాలతో పాటు కూతలేరు పరివాహక ప్రాంతంలోని చీలేపల్లి, అలంకరాయినిపేట, సలకం చెరువు, జూలాకాల్వ, జలాల్పురం, పెరవలి తదితర వాగులు, వంకల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ ప్రసాద్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు