Homeజిల్లాలుఅనంతపురంరాప్తాడు రైతులకు శుభవార్త: నెరవేరిన మార్కెట్ ప్రాంగణం కల.. 15 ఎకరాల భూమి కేటాయింపు

రాప్తాడు రైతులకు శుభవార్త: నెరవేరిన మార్కెట్ ప్రాంగణం కల.. 15 ఎకరాల భూమి కేటాయింపు

- Advertisement -

ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు నియోజకవర్గ రైతులకు, వ్యాపారులకు సౌలభ్యంగా ఉండేలా మార్కెట్ ప్రాంగణం ఏర్పాటుకు మార్గం సుగమమైందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం నిర్మాణానికి దేవాదాయ శాఖతో చర్చలు జరపడంతో రాప్తాడు ​శ్రీపండమేరు వెంకటరమణ స్వామి దేవస్థానానికి చెందిన సర్వే నెం. 476-3లోని 15 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులను కమిటీ సభ్యులకు అనంతపురం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ఉన్నప్పటికీ సొంతంగా ప్రాంగణం లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులుపడే వారన్నారు.
ఈ స్థలం జాతీయ రహదారి-44కు ఆనుకుని ఉండటంతో రవాణా పరంగా రైతులు, గొర్రెలు, మేకల సంత నిర్వహణకు, వ్యాపారులకు కూడా ఎంతో అనుకూలంగా* ఉంటుందన్నారు. 11 ఏళ్ల లీజు ప్రాతిపదికన నిబంధనల ప్రకారం.. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.50,000 అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి మూడేళ్లకోసారి ఈ అద్దెపై 30 శాతం పెంపు ఉంటుందన్నారు.
​ నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంగణం వారికి అన్నివిధాలుగా తోడ్పడుతుందని, కమిటీ సభ్యులు చొరవ తీసుకుని రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ భూమి కేటాయింపునకు ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీతను మార్కెట్ కమిటీ చైర్మన్ వేపకుంట సుధాకర్, కార్యదర్శి కె.మల్లిక, డైరెక్టర్లు స్వర్ణక్క, లక్ష్మీనరసమ్మ, వరలక్ష్మి, మంజునాథ్, చెన్నకేశవులు,
పోతన్న, బుల్లెట్ రఫీ, నాయకులు అనిల్ చౌదరి, పామురాయి రఘు, రవిచంద్ర, సిబ్బంది లక్ష్మణమూర్తి, ధనుంజయ తదితరులు కలిసి శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు