Homeజిల్లాలుఅనంతపురంఉద్యోగ కుటుంబానికి ఆర్థిక వితరణ

ఉద్యోగ కుటుంబానికి ఆర్థిక వితరణ

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూఏ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ సెక్షన్ లో స్వీపర్గా పనిచేస్తున్న ఎస్. శ్రీరాములు అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇచ్చేందుకు టైం స్కేలు ఉద్యోగులు ఐక్యతతో ఒకరోజు వేతనం 45356 రూ..ను సోమవారం పరిపాలన భవనంలో వీసీ ఎన్ వి ఆర్ జ్యోతి కుమార్, రిజిస్ట్రార్ ఈ రమేష్ బాబు చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె. చంద్రశేఖర్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్బి . శివయ్య, జనరల్ సెక్రెటరీ
హెచ్. బి.సంజీవప్ప, ట్రెజరర్ కె. రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. నారాయణప్ప, గౌరవ అధ్యక్షుడు టి. హనుమంతప్ప పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు