Homeజిల్లాలుఅనంతపురంకరువు రైతులను ఆదుకోవాలి.. ఉచిత పంట బీమా అమలు చేయాలి

కరువు రైతులను ఆదుకోవాలి.. ఉచిత పంట బీమా అమలు చేయాలి

- Advertisement -

విశాలాంధ్ర-అనంతపురం: కరువు బారిన పడిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించి ఉచిత పంట బీమా అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున డిమాండ్ చేశారు. అలాగే పంట బీమా నమోదు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా రైతులకు ఏటా పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరుస నష్టాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా, రుణభారం తాళలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదని అన్నారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు వేసిన రైతులతో పాటు పంట ఎదుగుదల దశలో ఉన్న రైతులు కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాలో స్పష్టమైన కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని ఉచిత పంట బీమా అమలు చేయడంతో పాటు, బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు పి. రామకృష్ణ, టి. నారాయణస్వామి, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వీటీ రామాంజనేయులు, సింగనమల రైతు సంఘం నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు