- Advertisement -
విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వారి పాఠశాల ఆవశ్యకతను బట్టి మూడు ఇనుప టేబుల్స్ నూతన లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గవ్వల రాధాకృష్ణ, ఒంటి కొండా కొత్త శ్రీరాములు, కోశాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హెడ్మాస్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం కూడా లైన్స్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, మాజీ కార్యదర్శి నాగేంద్ర, మాజీ అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, మోహన్ దాస్, పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


