విశాలాంధ్ర – రాప్తాడు : పారదర్శకమైన, పొరపాట్లు లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు రాప్తాడు నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి (ERO), అనంతపురం హెచ్.ఎల్.సి ప్రత్యేక ఉప కలెక్టర్ వి. వెంకట నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో ఆయన ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఎల్ఓల సర్వే వివరాలు, మ్యాపింగ్ ప్రక్రియ, సేకరణకు సాధ్యపడని వివరాలు, అలాగే చిరునామా మారినవారు/,మరణించినవారు, నకిలీ ఓటర్లు, ఒకేలాంటి ఫోటోలు, సమాచారం ఉన్న ఓటర్ల జాబితాలు మరియు బిఎల్ఓ యాప్‌లోని సమాచారంపై సమగ్రంగా చర్చించారు. సవరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో సహకరించాలని ఈఆర్‌ఓ కోరారు.
ఈ సమావేశంలో ఆత్మకూరు, రామగిరి అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి తహశీల్దార్లు లక్ష్మినాయక్, ప్రదీప్, ఉదయ్ భాస్కర్, సురేష్ బాబు, మనోజ్, ఈడిటి సువర్ణ,
టీడీపీ, బీజేపీ, సీపీఎం నాయకులు సుధాకర్ చౌదరి, చల్లా జయ కృష్ణ, చెన్నకేశవులు, అజేష్ యాదవ్, రామాంజనేయులు,
రాప్తాడు ఎన్నికల విభాగం సిబ్బంది హాజరయ్యారు.
పాల్గొన్నారు.
పారదర్శక ఓటర్ల జాబితాయే లక్ష్యం: ఈఆర్‌ఓ వెంకట నారాయణ
- Advertisement -


