Homeజిల్లాలుఅనంతపురంబిజెపికి పతనం తప్పదు

బిజెపికి పతనం తప్పదు

- Advertisement -

నీట్ పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్

విశాలాంధ్ర- అనంతపురం కార్పోరేషన్ : ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యా రంగ సమస్యలపై కాక్రోచ్‌జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు క్రూరంగా దాడికి పాల్పడం, యువతపై లాఠిఛార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించడాన్ని నిరసిస్తూ బుధవారం అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద సిపిఐ జిల్లా కమిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులపై లాఠిఛార్జి ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. నీట్ పేపర్ లీకేజీని, విద్యార్థులపై జరిగిన దాడులకు బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంతో విద్యారంగాన్ని ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాsTÖకరణ దిశగా నడిపించడం వల్లనే పరీక్షల నిర్వహణ గాడి తప్పిందన్నారు. వరుసగా పరీక్ష పేపర్ల లీకులతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీపై వ్యతిరేకత పెరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మన రాష్ట్రంలోని టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వం జాగ్రత్తపడాల్సి ఉందన్నారు. లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వాలు కూల్చివేశారో అలాగే ఇక్కడి కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుందన్నారు. ప్రభుత్వంలో చిలీకలు తెచ్చి రాజకీయ సంక్షోభాన్ని కేంద్రం తీసుకొస్తుందని, జాగ్రత్తగా ఉండాలిన కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

కేంద్రంపై ప్రజలు తిరగబడుతారు…
సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై చేపడుతున్న వ్యతిరేకత, నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు. ఇలాగే నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తిరగబడుతారని హెచ్చరించారు. విద్యార్థులపై జరిగిన లాఠిఛార్జిని ఖండిస్తూ, వారికి సంఘీభావంగా సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న 20 మంది విద్యార్థుల కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

24న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి
ఎఐఎసఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్

ఢిల్లీలో విద్యార్థులపై లాఠిఛార్జిని నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు ఎఐఎసఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వంగా వ్వహరిస్తోందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వ హయాంలో 89 ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయని తెలిపారు. ఈ నెల 24వ తేదీన చేపడుతున్న బంద్‌లో విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎఐఎసఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, సహాయ కార్యదర్శి మస్తాన్, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ, టి.నారాయణస్వామి, నగర సహాయ కార్యదర్శులు రమణయ్య, వీకే కృష్ణుడు, లింగమయ్య, అనంతపురం రూరల్ మండల కార్యదర్శి జి.నరేష్, బుక్కరాయసముద్రం మండల కార్యదర్శి బండి రామకృష్ణ, ఎఐటియుసి నాయకులు చిరంజీవి, సిపిఐ నాయకులు అలీపీరా, గాజులింగప్ప, వరలక్షమ్మ, లక్ష్మినారాయణ, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు