Homeజాతీయందిల్లీ మెట్రో స్టేషన్‌ల మూసివేతపై సుప్రీంకోర్టు అసహనం

దిల్లీ మెట్రో స్టేషన్‌ల మూసివేతపై సుప్రీంకోర్టు అసహనం

- Advertisement -


న్యూదిల్లీ: సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీ మెట్రోను మూసివేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేశ రాజధాని దిల్లీలో పలు మెట్రో స్టేషన్‌లను మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో పాటు సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మధ్యాహ్నంలోగా పరిస్థితి సరిదిద్దకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీజేపీ అధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను కారణంగా చూపుతూ దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వరుసగా రెండో రోజు కూడా 16 మెట్రో స్టేషన్‌లను మూసివేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో స్టేషన్‌ల మూసివేత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ బార్ అసోసియేషన్ ఓ పిటిషన్ వేసింది. దీనిపై సీజేఐ స్పందిస్తూ…మధ్యాహ్నం వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు దిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు