న్యూదిల్లీ: ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా విద్యార్థుల సమస్యలపై పట్టుదలతో గత 26 రోజులుగా దీక్ష చేసిన పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్థరాత్రి విరమించారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో తన నిరాహార దీక్షను విరమించారు. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను ముగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ. సోనమ్ కు ప్రత్యేక సందేశం పంపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘వైద్యుల సూచనలు పాటించి సోనమ్జీ వేగంగా కోలుకోవాలి. వీలైనంత త్వరగా ఆయన బరువు పెరగాలని కోరుకుంటున్నా. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
లిఖిత పూర్వక హామీ వచ్చాకే విరమించా: వాంగ్‌చుక్
దీక్ష విరమించిన అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ శుక్రవారం (ఈరోజు) ఉదయం వీడియో విడుదల చేశారు. ‘నీట్ పేపర్ లీకేజీ, పరీక్షా విధానంలో జవాబుదారీతనం, పరీక్షల్లో విస్తృత స్థాయి సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చిస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై ఎటువంటి కేసులు పెట్టబోమని చెప్పింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అందుకే దీక్ష విరమిస్తున్నా’ అని సోనమ్ తన వీడియోలో పేర్కొన్నారు. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ ‘సోనమ్జీ దీక్ష విరమించడం ఆనందంగా ఉంది. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని మేల్కొలిపారు. మీ అసాధారణ ధైర్యం, త్యాగానికి కృతజ్ఞతలు సర్’ అని తెలిపారు. అయితే, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగుతుందని దీప్కే స్పష్టం చేశారు.
కేంద్రం లిఖితపూర్వక హామీ…వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- Advertisement -
RELATED ARTICLES


