మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక
విశాలాంధ్ర -ధర్మవరం ; మొబైల్ హ్యాండిల్ ఎక్స్రే ద్వారా ఉచిత ఊపిరితిత్తుల క్షయవాది నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం అర్బన్ లో కొత్తపేటలో సంధ రాఘవేంద్ర , సంధ రవీంద్ర ఆధ్వర్యంలో ఉచితంగా అందరికీ మొబైల్ ఎక్స్ రే ద్వారా ఊపిరితిత్తుల క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు దాదాపుగా 120 మంది వరకు ఎక్స్ రే తీయడం జరిగింది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రారంభ దశలోనే క్షయ వ్యాధికి సంబంధించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సరైన చికిత్స పొందవచ్చు అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు హెల్త్ అసిస్టెంట్ , క్షయ వ్యాధి విభాగం సూపర్వైజర్స్ ఎరుకలప్ప, నాగేంద్ర, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఊపిరితిత్తుల క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు…
- Advertisement -
RELATED ARTICLES


