- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాగితాల వీధిలో ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో గురు పౌర్ణమి సందర్భంగా అర్చకులు రాధాకృష్ణమూర్తిని కరెస్పాండెంట్ కిషోర్, హెడ్మాస్టర్ ఆదిలక్ష్మి, రమేష్ దేశాయ్, పని రాజ్, ప్రసాద్, ఉపాధ్యాయ బృందములవారు ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం కరెస్పాండెంట్, హెడ్మాస్టర్ మాట్లాడుతూ ప్రత్యేక వ్యాస మహర్షి గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. అర్చకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా నాకు ఈ సత్కరణ మరుపురాని రోజుగా వారు అభివర్ణించారు.


