విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలంలోని చిన్నముష్టూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. ఆశ్రిఫ్ అలీ తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 5న కళాశాల ప్రాంగణంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సివిల్ ఇంజినీరింగ్ శాఖాధిపతి, జనరల్ విభాగం శాఖాధిపతి పాల్గొన్నారు.


