Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం.. జడ్జీలు

సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం.. జడ్జీలు

- Advertisement -
  • విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ధర్మారం కోర్టులో సెప్టెంబర్ 12వ తేదీన జాతీయాల్లో కదా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట హరీష్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు కోర్టు పరిధిలోని పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. తదుపరి జడ్జీలు మాట్లాడుతూ
    జాతీయ లోక్ అదాలత్ లో రాజీ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ పరిధిలో చాలాకాలంగా పెండింగ్ లోఉన్న కేసులు, రాజీ అయ్యే కేసులను గుర్తించి, లోక్ అదాలత్ లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 12వతేదిన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు