Sunday, November 24, 2024
Homeఆంధ్రప్రదేశ్డెంగ్యూ వ్యాధి పై పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలి

డెంగ్యూ వ్యాధి పై పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలి

జిల్లా సహాయ మలేరియా అధికారి లక్ష్మీనాయక్
విశాలాంధ్ర ధర్మవరం : డెంగ్యూ వ్యాధిపై పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా సహాయ మలేరియా అధికారి లక్ష్మీనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శివానగర్లో జిల్లా సహాయ మలేరియా అధికారితోపాటు సబ్ యూనిట్ మలేరియా అధికారులు పర్యటించి డెంగ్యూ వ్యాధిపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్టెలలో నీటిని నిల్వ ఉంచరాదని తెలిపారు. రాత్రి సమయాలలో ఇంటిలో వేపాకు పొగ వేసుకోవాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే ను ఫ్రైడేను పాటించాలని తెలిపారు. వెక్టార్ కంట్రోల్ ఇష్యూస్ గురించి కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రజల అవగాహన విషయంలో అధికారులు నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులు జయరాం నాయక్, గోపీనాయక్, వెంకటేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు