Homeఅంతర్జాతీయంజో బైడెన్ ఆరోగ్యం విషమం.. చికిత్సపై కుమారుడు హంటర్ కీలక వ్యాఖ్యలు

జో బైడెన్ ఆరోగ్యం విషమం.. చికిత్సపై కుమారుడు హంటర్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు ఉన్న క్యాన్సర్ మరింతగా వ్యాప్తి చెందిందని, చికిత్స సమయంలో తీవ్ర నొప్పిని ఎదుర్కొంటున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వెల్లడించారు. క్యాన్సర్ ఎముకలకే పరిమితం కాకుండా శరీరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించిందని ఆయన తెలిపారు.ఇంటర్వ్యూలో హంటర్ బైడెన్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. జో బైడెన్ క్యాన్సర్ ప్రస్తుతం చాలా బాధాకరమైన స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. శారీరకంగా తన తండ్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.అయితే హంటర్ బైడెన్ చేసిన తాజా వ్యాఖ్యలపై జో బైడెన్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.

2025 మేలో తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు.ఇది వేగంగా వ్యాప్తి చెందే క్యాన్సర్ రకమని, అప్పటికే వ్యాధి ఎముకలకు చేరినట్లు వైద్యులు గుర్తించారని ఆయన కార్యాలయం తెలిపింది.అనంతరం బైడెన్ రేడియేషన్ చికిత్సతో పాటు హార్మోన్ థెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు