విశాలాంధ్ర-గూడూరు: బూడిదపాడు గ్రామంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పర్యటించి ఇంటింటా కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా సోమవారం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ జె . సురేష్, సుంకుల పరమేశ్వరి ఆలయ వైస్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బూడిదపాడులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పర్యటన
- Advertisement -
RELATED ARTICLES


