విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో ఆన్సెట్ అనంతపురం సహకారంతో బుధవారం ప్రత్యేక అవగాహన, ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. టి. శైలజారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆన్సెట్ మేనేజర్ శ్రీనివాసులు, కళాశాల సూపరింటెండెంట్ అన్వర్ బాషా, ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ ఎల్.ఎస్. రెడ్డి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి, లక్ష్యసాధన, సామాజిక బాధ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, కంప్యూటర్ అప్లికేషన్స్ లెక్చరర్ ఎం. సుధాకర్ సమన్వయంతో నిర్వహించగా, కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ గాయత్రి సహకరించారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
యువతే దేశ భవిష్యత్తుకు దిక్సూచి
- Advertisement -
RELATED ARTICLES


