విశాలాంధ్ర-నార్పల (అనంతపురం జిల్లా) :- భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవ వేడుకలను నార్పల శాఖ గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ పలువురు కొనియాడారు.డాక్టర్ రంగనాథన్ రూపొందించిన గ్రంథాలయ శాస్త్ర సూత్రాలు నేటికీ గ్రంథాలయ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, గ్రంథాలయాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కావేరి, విద్యార్థినీ విద్యార్థులు, లక్ష్మీనారాయణ, శ్రీరాములు, నాగార్జున, లక్ష్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు.


