డిప్యూటీ డిఎంహెచ్వో. డాక్టర్. భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; అధిక ప్రమాద గర్భధారణ పై ధర్మవరం డివిజన్: డి ఎం అండ్ హెచ్ వో డాక్టర్ ఫైరోజా బేగం గారి ఆదేశాల మేరకు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా.భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ధర్మవరం డివిజన్ పరిధిలోని పీహెచ్సీ లు, యూపీహెచ్సి లలో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు సమీకృత అధిక ప్రమాద గర్భధారణల నిర్వహణపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఆగస్టు 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు అధిక ప్రమాద గర్భ దారులపై పూర్తి వివరణ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ అధిక ప్రమాద గర్భధారణలను ముందుగానే గుర్తించడం, గర్భిణులకు తగిన జాగ్రత్తలు సూచించడం, సంభవించే సమస్యలను నివారించడం, అవసరమైన వైద్య సేవలు అందించడం, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత రెఫర్ లకు సకాలంలో రిఫర్ చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో డి ఐ ఓ. డాక్టర్ చెన్నారెడ్డి, డాక్టర్ సురేష్ నాయక్, డాక్టర్ గోవర్ధన్ , డాక్టర్ పుష్పలత , డాక్టర్ చరణ్ , డిప్యూటీ హెచ్ ఈ ఓ విజయ్ కుమార్ , సి ఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అధిక ప్రమాద గర్భధారణలపై ఏఎన్ఎం లకు శిక్షణతరగతులు..
- Advertisement -
RELATED ARTICLES


