Homeజిల్లాలుశ్రీ సత్యసాయివ్యక్తిని హత్య చేసి, చెరువులో పడేశారు..

వ్యక్తిని హత్య చేసి, చెరువులో పడేశారు..

- Advertisement -

దర్యాప్తు చేపట్టిన వన్టౌన్ పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రెండవ బరువు చెరువు వద్ద స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు చెరువు నుండి దాదాపు 40 సంవత్సరాలు వయసు గల ఓబుల నాయన పల్లి గ్రామానికి చెందిన బోయ దాసరి శ్రీనివాసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పట్టణ పోలీసులు వివరాలు తెలుపుతూ రెండు సంవత్సరముల నుంచి పట్టణంలో ఎల్సికేపురంలో నివాసం ఉంటున్నాడని భూమిని కౌలుకు తీసుకొని కూరగాయలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలిపారు. కొంతమందితో ఆర్థిక లావాదేవీలు ఉండడంతో గొడవ కొనసాగుతూ ఉండేదని తెలిపారు. వారం రోజుల కిందట గొడవ పడినట్లు బంధువులు కూడా తెలిపారని తెలిపారు. మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాసులు తిరిగి రాలేదని. ఆదివారం రాత్రి ధర్మవరం రెండో మరువ చెరువు వద్ద శవమైతెలాడని తెలిపారు. ఈ ఘటన వద్ద డిఎస్పి బీవీ జగన్నాథరాజు సిఐలు రెడ్డప్ప, జయ నాయక్ విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ త్వరలోనే ఈ కేసును చేదిస్తామని వారు తెలిపారు. మృతునికి భార్య భవాని ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఈ హత్య వెనుక ఉన్న వ్యక్తులను వారి పేర్లను ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు