విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉరవకొండ పట్టణంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించాలనే సందేశంతో జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం, గవి మఠం దేవాలయం, పట్టణంలోని గాంధీ బజార్లోని స్వాతంత్ర్య చిహ్నం వద్ద టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ప్యారం కేశవానంద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు.ఈకార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు వర ప్రసాద్, గ్రామపంచాయతీ కార్యదర్శి షేమీర్ భాష, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


