మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన సోదాలు ముగిశాయి.
సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా హైదరాబాద్, కడపతో పాటు మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. తనిఖీల సందర్భంగా పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
రెండు లాకర్ల తాళాలు సీజ్
అవినాష్ రెడ్డి (Avinash Reddy)నివాసంలో లెక్కలు చూపని రూ.24 లక్షల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు.అలాగే ఆయనకు చెందిన రెండు లాకర్ల తాళాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.సోదాల సందర్భంగా లభించిన డిజిటల్, ఆర్థిక ఆధారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.


