విశాలాంధ్ర ఆస్పరి : కామ్రేడ్ స్వర్గీయ సురవరం సుధాకర్‌రెడ్డి ఆశయ సాధనకు నేటి యువత పునరంకితం కావాలని సీపీఐ మండల కార్యదర్శి బి.విరూపాక్షి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వామపక్ష ఉద్యమ బలోపేతానికి, పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు సురవరం సుధాకర్‌రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. జీవితాంతం ప్రజా సమస్యలపై పోరాడిన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి, హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రామాంజనేయ, రంగప్ప, హనుమంతు, రవి, మల్లికార్జున, రంగన్న తదితరులు పాల్గొన్నారు.


