గూడూరు వైసీపీ ఇన్చార్జి బూదూరు గురవయ్య
విశాలాంధ్ర – గూడూరు : దేవాలయ భూముల వేలంపాట లో జరిగిన అవకతవకల పై విచారణ చేయించాలని గూడూరు వైసీపీ ఇంచార్జి బూదూరు గురవయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నియోజకవర్గంలో దేవాదాయ శాఖ భూములను టీడీపీ నాయకులకు కట్టబెడుతున్నారని అన్నారు…ధర్మరాజులస్వామి దేవస్థానం లో ఒకటిన్నర కోటి అవినితి జరిగిందని పేర్కొన్నారు.
.దుకాణాల విషయం లో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు చేశారని తెలిపారు..నియోజకవర్గం లో ఉన్న అన్ని దేవాలయాల లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు…కలవకొండ టెంపుల్ లో అవినీతి పై సాక్షాత్తు చైర్మన్ ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేస్తే దానిపై విచారణ చేయలేదని విమర్శించారు….దేవాదాయ శాఖ మంత్రి ఎండోమెంట్ శాఖలో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెట్టాలని అన్నారు…ప్రశ్నిస్తే కేసులు పెడతారా… బెదిరింపులకు ఎవరూ బయపడరని స్థానిక ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసిరారు.ఎమ్మెల్యే కు అన్ని విషయాల్లో వాటా ఉంది…అన్ని విషయాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మన్నెం శ్రీనివాసులు , పల్లి కోటేశ్వర రావు , కల్లూరు రవి, ఎల్లా శ్రీనివాసులు రెడ్డి,అట్లా శ్రీనివాసులు రెడ్డి ,ముప్పాల చంద్ర మోహన్ రెడ్డి , వసంత్ కుమార్ రెడ్డి , జనార్ధన్ రెడ్డి , కృష్ణ రెడ్డి, వేణు రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
దేవాలయ భూముల పై విచారణ చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


