Homeజిల్లాలుఅనంతపురంచెరువులు, కుంటలు, కాలువ భూముల ఆక్రమణలను అరికట్టాలి….

చెరువులు, కుంటలు, కాలువ భూముల ఆక్రమణలను అరికట్టాలి….

- Advertisement -

సోమవారం గ్రీవెన్స్‌లో సాక్ష్యాధారాలతో వినతిపత్రం అందజేస్తాం : కడపం దామోదర్….

విశాలాంధ్ర – నార్పల: మండలంలోని చెరువులు, కుంటలు, కాలువ భూములను ఆక్రమణల నుంచి పరిరక్షించాలని కోరుతూ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు సాక్ష్యాధారాలతో కూడిన వినతిపత్రం అందజేయనున్నట్లు బీజేపీ కిసాన్ మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షుడు కడపం దామోదర్ తెలిపారు.మండలంలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని, గతంలో ఆక్రమితమైన భూములను సమగ్రంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఆక్రమణలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.
చెరువులు, కుంటల పరిధిలోని కాలువ భూములు కూడా ఆక్రమణలకు గురవుతున్నందున గొర్రెలు, పశువుల కాపరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పశువుల మేతకు వినియోగించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పశుగ్రాస పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు.భవిష్యత్ తరాలకు చెరువులు, కుంటలు ఉపయోగపడేలా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆక్రమణకు గురైన భూములను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకునేలా జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టాలని సోమవారం గ్రీవెన్స్‌లో సాక్ష్యాధారాలతో విజ్ఞప్తి చేయనున్నట్లు కడపం దామోదర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు