Homeజిల్లాలుకర్నూలురైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

రైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

- Advertisement -
విశాలాంధ్ర - పెద్దకడబూరు (కర్నూలు) : రైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏనాడు కూడా రైతుల గురించి కానీ, రైతు కూలీల గురించి కానీ, పేదవాళ్ల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, వైసీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతుల సమస్యలు, డీఎస్సీ, జగనన్న కాలనీలు, మీరు వేసిన సీసీ రోడ్లు, ఇసుక అక్రమాలు, మీరు ఆక్రమించుకున్న పేదల భూముల వ్యవహారాలు, పింఛన్లు దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మీ పార్టీ మనుగడ కాపాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడడం కాదు సవాల్ కు సిద్ధంగా ఉండాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజు అద్దాలు మాట్లాడి ఆయన ఆత్మను క్షోభ పెట్టడం మంచిది కాదని హితవు పలికారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు