విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు.టీచర్ల బదిలీల విషయంలోనూ ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రసంగించారు.తల్లిదండ్రులతో సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని రేవంత్‌రెడ్డి అన్నారు.ఉపాధ్యాయుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు రెండేళ్ల సమయం ఇస్తే చాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం అన్నివిధాలా సహాకరిస్తోంది
ఃరాష్ట్రంలో 88 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. నేనూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. సాంకేతిక విద్యకు సంబంధించి ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుంది.పాలిటెక్నిక్ విద్యావిధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. విద్యాశాఖ కమిషన్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ సమస్యను కూడా పరిష్కరించాం. ఇటీవల ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేస్తే చాలా బాధ కలిగిందిఃః అని సీఎం పేర్కొన్నారు.అంతకుముందు కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు.అనంతరం ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.


