విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం షేక్షన్పల్లి గ్రామంలో శనివారం హరిత రాయబారులకు డిప్యూటీ ఎంపీడీవో మహ్మద్ రఫీ చేతుల మీదుగా చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, బనియన్లు, టవల్స్ అందజేశారు. గ్రామంలో పారిశుధ్య పరిరక్షణలో హరిత రాయబారుల సేవలు అభినందనీయమని రఫీ తెలిపారు. వారు ప్రతిరోజూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. హరిత రాయబారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కూడా పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, హరిత రాయబారులు పాల్గొన్నారు.


