: ఏపీయుడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు తెలిపారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 2న కోరికల దినోత్సవం పాటిస్తామని అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే దశల వారి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఐజేయూ ప్లీనరీ లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళామని…. సీఎం వెంటనే స్పందించి సీఎంవో కు పంపారు అని గుర్తుచేశారు. సీఎంఓ గతంలో రద్దైన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు అని సుబ్బారావు చెప్పారు. ప్రభుత్వం కట్టే డబ్బు విషయం క్యాబినెట్ చర్చ కు వెళ్లాల్సి ఉందని… ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయితే ఐ అండ్ పీఆర్ కు కేటాయించే బడ్జెట్ లో కడతామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారని చెప్పారు. హౌసింగ్ స్కీమ్ ప్రతిపాదనలో ఉందని చెప్పారు. అందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పారని… రూ.100 కోట్లు వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తోందన్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు ఫించన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, బీహార్, కేరళ ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఇచ్జిన విధంగా రిటైర్డ్ జర్నలిస్టులకు ఫించన్ సౌకర్యం కల్పించాలన్నారు. 58 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర లో జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాన్ని తీసుకు వచ్చింది.. ఆ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతున్నాం అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో 2 శాతం నిధులు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి… తద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. హెల్త్ కార్డు అమల్లో ఉన్న లోపాలను సరిచేసి అన్ని ఆసుపత్రిలో అమలయ్యే విధంగా కో ఆర్డినేషన్ కమిటీ లు జిల్లాల వారిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళామని.. అమలులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, అధికారులు, జర్నలిస్టులతో, ప్రభుత్వం కలసి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. అక్టోబర్ 2న కోరికల దినోత్సవం నిర్వహిస్తున్నాం. జర్నలిస్టులకు రక్షణ చట్టం కోసం, ఇళ్ల స్థలాల కోసం దేశ వ్యాప్తంగా అందోళనలు చేపట్టబోతున్నాం. అందరూ స్పందించి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్స్ పరిస్కరించక పోతే.. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అన్నారు. అవసరం అయితే గతంలో మాదిరి అమరావతిలో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని హెచ్చరించారు. జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే బలోపేతం కోసం అందరూ కలసి కట్టుగా కృషి చేయాలి అన్నారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో యూనియన్ సభ్యుల విజయానికి కృషి చేయాలి అని తెలిపారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈఎన్ రాజు, జాతీయ కౌన్సిల్ సభ్యులు సనప రామకృష్ణ, నాగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాల రంగారెడ్డి, కేపీ కుమార్, చలపతి, జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆయుఫ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు భోగేశ్వర్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేంద్ర నాథ్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇంచార్జి విజయ్ భాస్కర్ రెడ్డి, బ్యూరో రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టులు మార్కండేయులు, ప్రభాకర నాయుడు, ట్రెజరర్ చౌదప్ప, జిల్లా కమిటీ సభ్యులు పట్టపోగుల రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఆందోళన
- Advertisement -


