Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమీటర్ రీడర్స్ కు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి

మీటర్ రీడర్స్ కు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి

- Advertisement -

సిపిఐ పట్టణ కార్యదర్శి పూల శెట్టి రవికుమార్
విశాలాంధ్ర ధర్మవరం : మీటర్ రీడర్స్ కు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పూల శెట్టి రవికుమార్
మీటర్ రీడర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏ ఐ టి యు సి, జిల్లా నాయకులు కిరణ్ కుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా లోని ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ మీటర్ రీడర్స్ గా పని చెస్తున్న కార్మికుల కు కాంట్రాక్టర్ సరిగా జీతాలు చెల్లించడం లేదు అని. యస్ ఈ , కలెక్టర్ లకు పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అని, కానీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకు కాంట్రాక్టర్ ప్రతి నేల 5 వ తెదిన ఖచ్చితంగా వేతానాలు చెల్లిస్తాని హామీ ఇచ్చారని, అలా కాకుండా రెండు నెలలకు ఒక సారి ఒక నేల వెతనం చెల్లిస్తున్నారు అని మండిపడ్డారు. కానీ ఇప్పుడు 10 వ తేదీ పైన ఇస్తానని అంటున్నారు అని, వారి కుటుంబాలు ఎలా జీవించాలని వారు ప్రశ్నించారు. విద్యుత్ మీటర్ రీడర్స్ ఇచ్చే జీతాలే తక్కువ మరి నెలల తరబడి పెండింగ్ పెడితే వారి కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని తెలిపారు. గత 3 నెలలు గా జీతాలు పెండింగ్ పెట్టడం తో కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు కి గురి అవుతున్నారు. అందుకే వెంటనే కార్మికులు ల కు జీతాలు చెల్లించాలని జిల్లా మీటర్ రీడర్స్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ అర్ ఒ ఆఫిస్ ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
మా సమస్యలు పరిష్కారం కానీ ఎడల ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కొండయ్య, బాబావాలి, శివానంద, ఆదర్శ్ కుమార్, అశ్వర్థ నారాయణ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు