Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాల యందు సెప్టెంబర్ 13 వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి పెద్దారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, క్యాంపు చైర్మన్ సత్రశాల ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సాంస్కృతిక మండలి లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్ ధర్మవరం, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా ఆందోత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు రెడ్డిపల్లి సుబ్బమ్మ, కీర్తిశేషులు రెడ్డిపల్లి రామప్ప జ్ఞాపకార్థం వీరి కోడలు, వీరి కుమారుడు రెడ్డిపల్లి రాజేశ్వరి రెడ్డి పల్లి రామచంద్రలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరం పూర్తిగా ఉచితము అని వారు స్పష్టం చేశారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి ఆపరేషన్లు శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు నందు నిర్వహిస్తామని, ఉచిత వశతి, ఉచిత రవాణా, ఉచిత ఆపరేషన్లు, ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రతినెలా నాలుగవ ఆదివారం ధర్మవరంలోని ఎస్బిఐ కాలనీలోమధు కంటి ఆసుపత్రిలో డాక్టర్ సంకారపు నర్సింహులు వద్ద షుగర్ పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించి, తగిన సూచనలు కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. కావున కంటి పరీక్షలు నిర్వహించుకునేవారు రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డులలో ఏదైనా రెండు జిరాక్స్ కాఫీలు మూడు ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. అంతేకాకుండా బీపీ షుగర్ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకుని తగ్గిన తర్వాత రావాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోలిగాళ్ళ వెంకటేశులు, బండారు వెంకటాచలం, నాగభూషణ, బుగ్గ ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు