మాజీమంత్రి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;! అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం వచ్చేంతవరకు మా పోరాటాలు ఆపము అని మాజీ మంత్రి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేతన్న నేస్తం లో రాని వారి ఇండ్లకు వెళ్లి అసలు విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అనంతరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేతన్న నేస్తం 25 వేల రూపాయలు సగముకు పైగా అవకతవకలు జరిగాయని, ఇందుకు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. నిజమైన నేతన్నలకు డబ్బు రాలేదని, ఎక్కడిది డొక్కాడని చేనేత కార్మికులను ఈ విధంగా మోసం చేయడం ప్రభుత్వానికి తగదు అని వారు హితవు పలికారు. అదేవిధంగా నారా లోకేష్ విద్యావ్యవస్థ పై అతితెరువుని ఉపయోగించడం సరికాదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో అర్హులు లేనివారికి ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు. అర్హులైన వారికి నేత అనే నేస్తం రాకపోవడానికి ఎవరైనా సరే చితకు అధికారులైన వదిలేది లేదని వారు మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. డీఎస్సీలో సిపిఐ విచారణ ఎందుకు చేయటం లేదని నారా లోకేష్ ను ప్రశ్నించారు. మా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీపీఎస్సీలో అవ్వక తవ్వకాలు జరిగిన వెంటనే సిబిఐ విచారణను చేపట్టమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మున్సిపల్, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయని, దీని ద్వారా మరింత మోసం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పంతోందని తెలిపారు. మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయం ఖాయమని తెలిపారు. ఇప్పటికే ఎన్ డి ఏ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయిందని, సమస్యలు పరిష్కారం కాక అలాగే ఉన్నాయని వారు ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో అన్ని సమస్యల పైన వైఎస్ఆర్సిపి పార్టీ పోరాటం చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డుఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అర్హులైన చేనేత కార్మికులకు నేతన నేస్తం వచ్చేంతవరకు మా పోరాటాలు ఆపం..
- Advertisement -
RELATED ARTICLES


