Homeజాతీయంనన్ను దొంగను చేశారు: సోదరి రాధపై నటి అంబిక ఫైర్

నన్ను దొంగను చేశారు: సోదరి రాధపై నటి అంబిక ఫైర్

- Advertisement -

ఒకప్పటి ప్రముఖ నటీమణులు, అక్కచెల్లెళ్లు అయిన అంబిక, రాధల మధ్య ఆస్తి వివాదం ముదిరింది. తనపై సోదరి రాధ చేసిన ఆరోపణలను అంబిక తీవ్రంగా ఖండించారు. తనను దొంగగా చిత్రీకరించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవహారాన్ని పోలీసుల వరకు తీసుకెళ్లడం తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.దాదాపు రూ. 46 కోట్ల విలువైన చెక్కులను తాను, తన సోదరుడు మల్లికార్జున్ కాజేయాలని చూశామంటూ రాధ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంపై అంబిక స్పందించారు. ఈ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. చిన్నతనం నుంచి కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించానని, అటువంటి తనపై రాధ గదిలో నుంచి చెక్కులు దొంగిలించానని నిందలు వేయడం బాధాకరమని అన్నారు. రాధ తన వస్తువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటుందని, నంబర్ లాక్ ఉన్న బ్యాగులనే వాడుతుందని, అటువంటప్పుడు దొంగతనం జరగడం అసాధ్యమని అంబిక వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు