Homeజిల్లాలుతూర్పు గోదావరిభారీ వర్షాలతో గిరిజన ప్రాంతాల్లో తీవ్ర నష్టం

భారీ వర్షాలతో గిరిజన ప్రాంతాల్లో తీవ్ర నష్టం

- Advertisement -

నష్టాన్ని వెంటనే అంచనా వేసి బాధితులకు సహాయం అందించాలి: సుజాత సల్మాన్..

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలతో అల్లూరి జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని సామాజిక కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ తెలిపారు.పలు ప్రభవిత గ్రామాల్లో పర్యటించిన ఆమె ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. భారీ వర్షాలకు పంటలు వరదల్లో కొట్టుకుపోయాయని, ఇళ్లు, రహదారులు దెబ్బతినడంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించి పంటలు, ఇళ్లు, రహదారులకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని ఆమె డిమాండ్ చేశారు. దెబ్బతిన్న రహదారులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, నష్టపోయిన రైతులు, కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు.ప్రభుత్వం గిరిజన ప్రాంతాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి కరువు జిల్లాగా ప్రకటించి బాధిత ప్రతి కుటుంబానికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు