Homeఆంధ్రప్రదేశ్బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

- Advertisement -

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మయన్మార్, అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన ఈ వాయుగుండం, ప్రస్తుతం అండమాన్‌లోని మాయాబందర్‌కు 580 కిలోమీటర్ల దూరంలో తూర్పు-ఈశాన్య దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా బంగ్లాదేశ్ వైపు కదులుతోంది. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి, సుమారు 72 గంటల్లో బంగ్లాదేశ్ తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవలే ఉత్తరాంధ్ర తీరంలో కళింగపట్నం వద్ద ఒక తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టం జరిగిన నేపథ్యంలో తాజా హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు