Homeతెలంగాణఎల్ నినో ఎఫెక్ట్: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు

ఎల్ నినో ఎఫెక్ట్: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా రికార్డవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రజలు అకాల వేడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, హైదరాబాద్‌లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలకు బదులుగా ప్రస్తుతం 34 డిగ్రీలుగా నమోదవుతోంది. ఎల్ నినో ప్రభావం వల్లే వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు