Homeజాతీయంసిమెంట్‌ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్‌..

సిమెంట్‌ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్‌..

- Advertisement -

సిమెంట్‌ ధరలు మరోసారి పెరగనున్నాయి. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సిమెంట్‌ బస్తా సగటు ధర రూ.7 పెరగ్గా.. అక్టోబర్‌లో మరో రూ.5 నుంచి రూ.20 వరకు పెంచే అవకాశం ఉందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ నివేదిక తెలిపింది. అయితే పెంచిన ధరలను కంపెనీలు ఎంతకాలం కొనసాగించగలవన్నది డిమాండ్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సిమెంట్‌ బస్తా సగటు ట్రేడ్‌ ధర రూ.356కు చేరింది. జులై, ఆగస్టులో ధరలు దాదాపు స్థిరంగా ఉండగా.. సెప్టెంబర్‌లో మాత్రం ధరల పెరుగుదల కనిపించింది. ట్రేడ్‌ సెగ్మెంట్‌తో పాటు నాన్‌-ట్రేడ్‌ విభాగంలోనూ ధరలు పెరిగాయని సెంట్రమ్‌ తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కంపెనీలు పెంచిన ధరల భారాన్ని డీలర్లు పూర్తిగా వినియోగదారులపై మోపలేదు.ఇదిలా ఉంటే పెరిగిన ఇంధన ఖర్చులు సిమెంట్‌ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో అధిక ధరలను అమలు చేసి కొనసాగించడం కంపెనీలకు మరింత కీలకంగా మారొచ్చని నివేదిక పేర్కొంది. రెండో త్రైమాసికంలో సిమెంట్‌ డిమాండ్‌ సాధారణ స్థాయి కంటే బలహీనంగా ఉన్నప్పటికీ.. సీజనల్‌ మందగమనంతో పోలిస్తే తగ్గుదల తక్కువగానే ఉందని తెలిపింది. త్రైమాసికం చివర్లో కొన్ని మార్కెట్లలో నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో అక్టోబర్‌లో మరోసారి ధరలు పెంచేందుకు కంపెనీలకు అవకాశం ఏర్పడిందని పేర్కొంది.ప్రాంతాల వారీగా చూస్తే సెప్టెంబర్‌లో దక్షిణ భారతదేశంలో సిమెంట్‌ ధరలు అత్యధికంగా రూ.11 పెరిగాయి. పశ్చిమ భారతంలో రూ.9, మధ్య, తూర్పు, ఉత్తర భారతంలో ఒక్కో బస్తాపై రూ.5 చొప్పున ధరలు పెరిగాయి. అయితే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నిర్మాణ కార్యకలాపాలపై రాబోయే ఆంక్షలు సిమెంట్‌ డిమాండ్‌పై ప్రభావం చూపొచ్చని నివేదిక తెలిపింది. డిమాండ్‌ పుంజుకోకపోతే అక్టోబర్‌లో పెంచిన ధరలను కొనసాగించడం కంపెనీలకు సవాలుగా మారొచ్చని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు