Homeజిల్లాలుఅనంతపురం3కె హెల్త్ వాక్ ను ప్రారంభించిన వీసీ ప్రొ.సుదర్శన్ రావు..

3కె హెల్త్ వాక్ ను ప్రారంభించిన వీసీ ప్రొ.సుదర్శన్ రావు..

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జేఎన్‌టీయూ అనంతపురం కళాశాల ప్రాంగణంలో గురువారం ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ 3కె హెల్త్ వాక్ ను ఉపకులపతి ఆచార్య హెచ్. సుధర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య బి దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణ , కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ..నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ 3కె హెల్త్ వాక్ నిర్మాణంలో భాగంగా మాదకద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. విశ్రాంత ఎస్పీ మల్లికార్జున వర్మ మాట్లాడుతూ .. మత్తు పదార్థాలు అలవాటు పడి వారి జీవితాన్ని పణంగా పెట్టవద్దు, ఉజ్వల భవిష్యత్ కై ఎలాంటి మారక ద్రవ్యాలను వాడకూడదని కోరారు.ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ డాక్టర్ జి. మమతా గారు మాట్లాడుతూ యువత తమతో పాటు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సమాజాన్ని కూడా మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై చైతన్యవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు