Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి…

- Advertisement -

మడకశిర సీఐకి ఏపీయుడబ్ల్యూజే ప్రతినిధుల ఫిర్యాదు…

విశాలాంధ్ర – గుడిబండ: వార్తా కథనం ప్రచురించిన విషయంపై విలేకరి కె.పి. శివరాజుతో అనుచితంగా మాట్లాడటంతో పాటు, ఆయన కుటుంబ సభ్యురాలిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీయుడబ్ల్యూజే మడకశిర–గుడిబండ ప్రెస్‌ యూనియన్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మడకశిర సీఐ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు అందజేశారు. గుడిబండ మండలంలోని ద్విచక్ర వాహన సమస్యపై విలేకరి శివరాజు వార్తా కథనం ప్రచురించగా, సెప్టెంబరు 28న బుల్లసముద్రం గ్రామానికి చెందిన రామాంజనేయులు ఫోన్‌ చేసి అనుచిత భాషలో మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను దూషించడంతో పాటు, కుటుంబ సభ్యురాలిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఏపీయుడబ్ల్యూజే యూనియన్‌ ప్రతినిధులు సీఐని కోరారు. జర్నలిస్టులు ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు