Homeజిల్లాలుఅనంతపురంజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా గాంధీజీకి వినతిపత్రం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జర్నలిస్టుల కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీజీకి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించి, జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. జర్నలిస్టులకు భద్రతా చట్టం తీసుకురావడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టుల చట్టబద్ధ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, జర్నలిస్టుల ప్రతినిధులతో కూడిన పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా డబ్ల్యూజేహెచ్‌ఎస్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల కోసం వెల్ఫేర్ ఫండ్‌ను పునఃప్రారంభించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పదవీ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే ప్రయాణంలో గతంలో ఉన్న జర్నలిస్టుల రాయితీని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి వి. రమేష్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్ పి. షేక్షావలి, గఫూర్, వెంకటేశులు, ఎర్రిస్వామి, మారెన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు