Homeఆంధ్రప్రదేశ్డ్వాక్రా సంఘాల రుణ పంపిణీలో ఏపీ టాప్‌.. దేశంలోనే అగ్రస్థానం

డ్వాక్రా సంఘాల రుణ పంపిణీలో ఏపీ టాప్‌.. దేశంలోనే అగ్రస్థానం

- Advertisement -

డ్వాక్రా సంఘాల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.
జాతీయ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) తాజా గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 నాటికి రాష్ట్రం రూ.15,229.40 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అలాగే రూ.82,639.56 కోట్ల రుణ నిల్వతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఏపీ ముందువరుసలో నిలిచిందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి వెల్లడించారు. డ్వాక్రా సంఘాలకు రుణాల పంపిణీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పలు డిజిటల్‌ సంస్కరణలు తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

రిజిస్ట్రేషన్‌, సర్వీస్‌ ఛార్జీలు తగ్గింపు
ఆధార్‌ బయోమెట్రిక్‌ విధానం, సభ్యుల గుర్తింపు ధ్రువీకరణ ద్వారా నకిలీ సభ్యత్వాలు, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విశిష్ట రిజిస్ట్రేషన్‌ నంబర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి ప్రతి డ్వాక్రా సంఘానికి ప్రత్యేక డిజిటల్‌ గుర్తింపును కల్పించినట్లు మంత్రి వివరించారు. దీనివల్ల సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత మరింత పెరిగిందన్నారు. రుణాల మంజూరు సమయంలో బ్యాంకులు వసూలు చేసే రిజిస్ట్రేషన్‌, సర్వీస్‌ ఛార్జీలను కూడా తగ్గించినట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల ఒక్కో డ్వాక్రా సంఘానికి ఏటా సుమారు రూ.32,500 వరకు ఆదా అవుతోందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను కూడా గణనీయంగా తగ్గించగలిగామని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు