- Advertisement -
- హాకీ ఆంధ్రప్రదేశ్ 33వ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం
- హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి.ఎం.చాణక్య రాజు
విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : హాకీ ఆంధ్రప్రదేశ్ 33వ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం శుక్రవారం విజయవాడ గవర్నర్‌పేటలోని ప్రకాశం రోడ్డులో ఉన్న హోటల్ ఆర్ గ్రాండ్‌లో నిర్వహించారు. రాష్ట్రంలో హాకీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, వివిధ స్థాయిల్లో పోటీల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.రాష్ట్రంలోని క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, హాకీని మరింత విస్తరించడం, రాబోయే పోటీలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై కార్యవర్గ సభ్యులు చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగేవరకు కె. భవాని శంకర్ ను నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.సమావేశానికి హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి.ఎం. చాణక్య రాజు అధ్యక్షత వహించారు. అసోసియేట్ అధ్యక్షుడు జి. సతీష్, ఉపాధ్యక్షుడు సూర్య ప్రకాశ్, కోశాధికారి ఎ. సుందర్ రామిరెడ్డి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కె. రాజశేఖర్, భారత్, శ్యామల, రిషిక లక్ష్మి పాల్గొన్నారు.


