అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్
విశాలాంధ్ర,షాద్ నగర్ :రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు చటన్పల్లిలో దేవి శరణం నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చటన్పల్లిలో ప్రతిష్ఠించిన అమ్మవారిని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక భక్తిభావంతో పాటు సేవా స్ఫూర్తిని చాటుతున్నాయని, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చటాన్‌పల్లిలో నవరాత్రి ఉత్సవాలు భక్తుల సందడి మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సి. పెంటయ్య, మురళీమోహన్, దిలీప్, మాజీ కౌన్సిలర్ చేగురి రాజేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు చెంది తిరుపతి రెడ్డి, శ్రీశైలం గౌడ్, సిద్ధార్థ, జాంగారి రవి, కరుణాకర్, రవితేజ, మాధవులు యాదవ్, రాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, శ్రీనివాస్, విజయ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సీతారాం, చటన్‌పల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


