Homeజిల్లాలుకర్నూలుపెద్దకడబూరు వైస్ ఎంపీపీ మొట్రు రామాంజనేయులు పేరు ఖరారు

పెద్దకడబూరు వైస్ ఎంపీపీ మొట్రు రామాంజనేయులు పేరు ఖరారు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండల రాజకీయాల్లో వైస్ ఎంపీపీ పదవిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పెద్దకడబూరు గ్రామం ఎంపీటీసీ-2 స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మొట్రు రామాంజనేయులుకు వైస్ ఎంపీపీ పదవి కట్టబెట్టేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం . మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రామకాంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ అధిష్ఠానం మండల ఉపాధ్యక్ష పదవిపై చర్చించినట్లు తెలిసింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే మొట్రు రామాంజనేయులుకు వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి నాయకత్వం అడుగులు వేస్తుంది.
మొట్రు రామాంజనేయులు స్థానికంగా మండలంలోనే అందుబాటులో ఉండే నాయకుడు కావడంతో ఆయనకు వైస్ ఎంపీపీ బాధ్యతలు అప్పగిస్తే మండలంలోని సమస్యల పరిష్కారానికి మరింత కృషి జరుగుతుందని గ్రామ ప్రజలు బలమైన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి, మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తారని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మొట్రు రామాంజనేయులుకు వైస్ ఎంపీపీ పదవి దక్కితే పెద్దకడబూరు గ్రామానికే కాకుండా మండల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన, ప్రమాణ స్వీకార తేదీపై స్పష్టత కోసం పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు