Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు యశోద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థినీలు ఎంపిక..

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు యశోద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థినీలు ఎంపిక..

- Advertisement -

ప్రిన్సిపాల్ అనూప్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని యశోద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థినీలు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ ,డైరెక్టర్ పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురంలోని జిహెచ్ఎస్ న్యూ టౌన్ పాఠశాలలో నవంబర్ 8వ తేదీన ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 బాలికల వాలీబాల్ పోటీలలో మా పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినీలు రిషితా రెడ్డి ,సత్య సహస్ర ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లా జట్టు తరఫున ఈ విద్యార్థినిలు నవంబర్ 11, 12వ తేదీలలో అల్లూరి జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. తదుపరి డైరెక్టర్, ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు