Homeజిల్లాలుఅనంతపురంఅవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి

అవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి

- Advertisement -

విశాలాంధ్ర – ధర్మవరం ; ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఏఐటియుసి సిపిఐ నాయకులు సిడిపిఓ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలోని ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారినిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి అని, దీనిపైన జిల్లా కలెక్టర్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , రాష్ట్ర ఐసిడిఎస్ కమిషనర్ స్పందించాలి అని తెలిపారు. ధర్మవరం ప్రాజెక్టులో అవినీతి తారాస్థాయికి చేరుతున్న ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు విచారణ నిర్వహించకుండా చూసి చూడనట్లు ఏమీ పట్టనట్లు పై స్థాయి అధికారులు ప్రవర్తించడం దారుణమని మండిపడ్డారు.
ప్రభుత్వాలు పేద పిల్లల పౌష్టికాహారం కోసం వేల కోట్ల రూపాయలు నిధులు అంగన్వాడి సెంటర్లకు ప్రాజెక్టులకు సెక్టర్లకు ఇస్తున్నారని, దీనిని కొంతమంది సిడిపివోలు, సూపర్వైజర్లు అధికారులకు కుమ్మక్కై ప్రతి బిల్లులోను అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పెట్టుకుంటూ, అందరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ పిల్లలకు రావలసినటువంటి పౌష్టికాహారం కానీ, సౌకర్యాలు కానీ ఏమాత్రం కూడా అందకుండా ఏమాత్రం కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అదే విధంగా అంగన్వాడి సెంటర్లకు రావలసినటువంటి కూరగాయలు గాని, ఇతర బిల్లులు గాని వారికి ఇవ్వకుండా కమిషన్ ఇవ్వాలని వేధిస్తూ వారిని కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు అని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు మరి అప్పులు చేసి కూడా కూరగాయలు కొనుగోలు చేసి అంగన్వాడి సెంటర్లు నడుపుతున్నారు అని, అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పరిధిలో కొత్తగా పోస్టులకు చేరే వారి వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకుంటూ, పోస్టులు కట్టబెట్టడం సమంజసమేనా అని నిలదీశారు. అంతేకాకుండా చనిపోయినటువంటి అంగన్వాడి టీచర్లకు , రిటైర్డ్ అయిన వారికి జీతాలు మంజూరు చేయడం విడ్డూరంగా ఉంది అని, అంతేకాకుండా కొన్ని సెంటర్లు ప్రభుత్వ భవనాలు ఉన్న, అద్దె భవనాల్లో ఉన్నట్టు చూపిస్తూ నెలనెలా తప్పుడు బిల్లులు పెట్టి అద్దె బిల్లులు కూడా కాజేస్తున్నారు అని ఆరోపించారు. అంతేకాకుండా ప్రాజెక్టు పరిధిలో సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తల పైన ఇష్టానుసారం మాట్లాడుతున్న సిడిపిఓ కి సర్వాధికారులు ఉన్నా ఆ సిబ్బందిని ఏమాత్రం కూడా మాట్లాడలేదు అని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది పట్ల మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. చర్యలు చేపట్ట లేకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, వేణుగోపాల్, నాగేంద్ర, ఏఐటియుసి జిల్లా నాయకులు కిరణ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు